ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంసీహెచ్‌ నుంచి గర్భిణులు, బాలింతల తరలింపు

ABN, First Publish Date - 2023-07-21T22:53:32+05:30

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది ఉధృ తి పెరుగుతోంది. గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లోకి వరద నీరు చేరుతుందనే ఆలోచనతో గర్బిణీలు, బాలింతలను ఐబీ చౌరస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 21: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది ఉధృ తి పెరుగుతోంది. గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లోకి వరద నీరు చేరుతుందనే ఆలోచనతో గర్బిణీలు, బాలింతలను ఐబీ చౌరస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీటి పారుదల శాఖ అధికారుల సూచన మేరకు కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. గర్భిణులు, బాలింతలు, శిశువులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది భారీ వర్షాలకు మాతా శిశు సంరక్షణ కేంద్రం పూర్తిగా నీట మునిగి రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అప్రమత్తమైన కలెక్టర్‌ మాతా శిశు కేంద్రంలోని మందులు, వైద్య పరికరాలు, బాలింతలు, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాతా శిశు కేంద్రం లో 126 మంది డెలీవరీ కోసం అడ్మిట్‌ కాగా 51 మంది డిశ్చార్జ్‌ కాగా 76 మందితోపాటు 43 మంది శిశువులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తరలించిన కాంగ్రెస్‌ నాయకులు

ఏసీసీ: ఎంసీహెచ్‌కు వరద ముప్పు పొంచి ఉన్నం దున కాంగ్రెస్‌ నాయకులు అప్రమత్తమై అంబులెన్స్‌ల్లో జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖల ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ నాయ కులు , కౌన్సిలర్లు, కార్యకర్తలు తరలింపు చర్యలు చేప ట్టారు. అనంతరం కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్‌ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి భవనాలు నిర్మించే ముందు అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం ఆలోచించకపోవడం దారుణమ న్నారు. గత ఏడాది వరదలు రావడంతో రాత్రిపూట తర లించామన్నారు. మంచిర్యాల పట్టణానికి ఎగువన ఎల్లం పల్లి ప్రాజెక్టు, దిగువన కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో వరద ఉధృతి పెరగడంతో కాలేజీ రోడ్డు ఏరియా, ఎన్‌టీఆర్‌ నగర్‌లను వరద ముంచెత్తుతుందన్నారు. కౌన్సిలర్లు బానేష్‌, నాయకులు ప్రభాకర్‌, సదానందం పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: ఎంసీహెచ్‌ భవనాన్ని వేరే చోటకు మార్చాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు డాక్టర్‌ నీలకంటేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఎంసీహెచ్‌ను సందర్శిం చి గోదావరి సమీపంలో ఆసుపత్రి ఉండడంతో వర్షాల కు, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరిగి ఆసుపత్రిలోకి చేరుతుందన్నారు. యేటా బాలిం తలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎల్ల య్య, జంగు, అర్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T22:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising