ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్పీ నాయకుల ముందస్తు అరెస్టు

ABN, First Publish Date - 2023-03-05T23:05:12+05:30

పెంచికలపేట, మార్చి 5: కాగజ్‌నగర్‌ మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సదస్సు నేపథ్యంలో బీఎస్పీ నాయకులను ఆదివారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షద్‌ హుస్సేన్‌తో పాటు గణేష్‌, రాంప్రసాద్‌, ప్రవీణ్‌, సాయి, ఆశన్న, సల్మాన్‌ తదితరులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెంచికలపేట, మార్చి 5: కాగజ్‌నగర్‌ మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సదస్సు నేపథ్యంలో బీఎస్పీ నాయకులను ఆదివారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షద్‌ హుస్సేన్‌తో పాటు గణేష్‌, రాంప్రసాద్‌, ప్రవీణ్‌, సాయి, ఆశన్న, సల్మాన్‌ తదితరులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. అనంతరం సాయంత్రం విడుదల చేసినట్లు ఎస్సై విజయ్‌ తెలిపారు. కాగా నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షద్‌హుస్సేన్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై సదస్సులు ఏర్పాటు చేసుకుంటే తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. అధికార పార్టీ వత్తాసు పలికి బీఎస్పీ నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నించారు.

బీఎస్పీ నాయకుల అరెస్టు దారుణం

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్టు చేయటం దారుణమని బీఎస్పీ కాగజ్‌నగర్‌ అధ్యక్షుడు రాంప్రసాద్‌ అన్నారు. ఆదివారం స్థానిక బీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోడు రైతు విషయంలో జిల్లా సదస్సును కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేయగా, పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించి సదస్సును ఏర్పాటు చేయకుండా అడ్డుకోవటం దారుణమన్నారు.

30యాక్టును సాకుగా చూపించి బీఎస్పీ నాయకులను అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఎస్పీ నాయకులు నక్క మనోహర్‌, దుర్గం ప్రవీణ్‌ మాట్లాడుతూ గత రెండ్రోజుల క్రితం గ్యాస్‌ధరలు తగ్గించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా చేస్తే వారికి 30యాక్టు వర్తించదా? అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేయటం పోలీసులు మానుకోవాలని సూచించారు.

Updated Date - 2023-03-05T23:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising