ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN, First Publish Date - 2023-01-15T01:29:22+05:30
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
సారంగాపూర్, జనవరి 14 : ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పొట్యా గ్రామపంచాయతీ సమీపంలో గల శ్రీశ్రీశ్రీ నాన్ మహారాజ్ జాతరను సంద ర్శించి ఆలయంలో మొక్కులను మొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... రాష్ట్రంలోని దేవాలయాలకు సీఎంకేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నా రని, రాష్ట్రంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందాయన్నారు. నాన్‌మహరాజ్ ఆలయ నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆలయ రహదారికి నిధులను మంజూరు చేయించి రోడ్డు నిర్మాణం పనులను వెంటనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే ఆటల పోటల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 25 వేలు, రెండవ బహుమతి రూ. 20 వేలను ఆలయ అందజేశారు. అనంతరం ఆలయ కమి టీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహి పాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, అడెల్లి దేవాలయం చైర్మన్ ఐటీ చందు, మాజీ అడెల్లి దేవాలయం చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండ లా ధ్యక్షులు మాధవ్‌రావు, నాయకులు గంగారెడ్డి, మల్లేష్‌లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.
Updated Date - 2023-01-15T01:29:24+05:30 IST