జనసంద్రమైన గంగాపూర్ జాతర
ABN, First Publish Date - 2023-02-05T22:23:36+05:30
రెబ్బెన, ఫిబ్రవరి 5: రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి జాతరకు ఆదివారం భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. స్వామివారి దర్శనానికి ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాతోపాటు మహారాష్ట్రవాసులు కూడా తరలివచ్చారు.
-పోటెత్తిన భక్తులు
-ఉమ్మడి జిల్లాలతోపాటు మహారాష్ట్ర వాసుల రాక
-రాకపోకలకు తీవ్రఇబ్బందులు
-కిక్కిరిసన జనం
రెబ్బెన, ఫిబ్రవరి 5: రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి జాతరకు ఆదివారం భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. స్వామివారి దర్శనానికి ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాతోపాటు మహారాష్ట్రవాసులు కూడా తరలివచ్చారు. సొంతవాహనాలపై రావడం, ఆర్టీసీబస్సుల సంఖ్య పెంచటంతో ఆలయకమిటీ ఊహించినదానికంటే ఎక్కువగా భక్తులు వచ్చారు. దీంతో ఆలయప్రాంతం కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో ఉండాల్సిన వచ్చింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్సీ దండే విఠల్ రాగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అదనపుకలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎస్పీ సురేష్‌కుమార్, ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, టీఆర్‌ఎస్ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం మండలకేంద్రంలోని పలువురు వ్యాపారులు అన్నదానం చేశారు.
ప్రత్యేక బస్సులు..
జాతరకు వచ్చిపోయే భక్తుల సౌకర్యార్థం ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకబస్సులను నడిపారు. వీటితోపాటు మండలకేంద్రంలోని జీపులు, కార్లు, ఆటోల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. రైల్వేగేటు తరుచూ పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
ఘనంగా రథోత్సవం..
జాతర సందర్భంగా ఆదివారం సాయంత్రం భక్తజన సందోహం మధ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భాజాభజంత్రీలు, వేదమంత్రాలతో గంగాపూర్ వాగులో స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగేందుకు ఆసక్తి చూపించారు.
Updated Date - 2023-02-05T22:23:38+05:30 IST