ఐటీడీఏ పీవోగా చాహత్ బాజ్‌పేయి
ABN, First Publish Date - 2023-07-03T01:44:08+05:30
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ప్రభుత్వం ఎట్టకేలకు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్న చాహత్ బాజ్‌పేయిని నియమిస్తూ ఆదే శాలు జారీ చేసింది.
ఉట్నూర్, జూలై 2: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ప్రభుత్వం ఎట్టకేలకు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్న చాహత్ బాజ్‌పేయిని నియమిస్తూ ఆదే శాలు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెం దిన చాహత్‌ను ప్రభుత్వం గత ఏడాది ఆసిఫా బాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియమించింది. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా ఉన్న వరుణ్‌రెడ్డిని నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనను ఇన్‌చార్జి పీవోగా కొనసాగిస్తూ వచ్చింది. గత నెల 30న కుమరం బీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లాలోని ప్రజాపతినిధులు కొందరు ఐటీడీఏ పీవో పోస్టు ఖాళీగా ఉందని తెలపడం తో సీఎం ముఖ్య కార్యదర్శి శాంతికుమారితో చర్చించిన అనంతరం చాహత్ బాజ్‌పేయి భర్త వరుణ్‌రెడ్డి నిర్మల్ కలెక్టర్‌గా పని చేస్తున్నందున ఆమెను ఉట్నూర్ పీవోగా నియమించడం సబబు అని భావించి శనివారం ఉత ్తర్వు లు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల సమస్యలపై పట్టు సాధించి ఉన్న ఆమె నియామకంపై గిరిజన సంఘాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, నూతనంగా నియామకమైన చాహత్ బాజ్‌పేయి సోమవారం బాధ్య తలు చేపట్టనున్నట్టు ఐటీడీఏ వర్గాలు తెలిపాయి. ఇన్‌చార్జి పీవో వరుణ్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రతీ సోమవారం నిర్వహించే గిరిజన దర్భార్‌లో ఆర్జీలను స్వీకరిస్తారు.
Updated Date - 2023-07-03T01:44:08+05:30 IST