ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

ABN, First Publish Date - 2023-06-03T00:56:01+05:30

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుక లు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి.

కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం వందన సమర్పణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుక లు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి దశాబ్ది వేడుకలను జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రారం భించారు. అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అంతకుముందు ఇంద్రకరణ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోనూ, మినీట్యాంక్‌బండ్‌, మున్సి పల్‌ కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేశారు. కలెక్టరేట్‌లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రజలకు మంత్రి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడు తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో గణనీయ ప్రగతి సాధించి దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. జిల్లా కలెక్టర్‌ కే.వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ రాంబాబు, ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌తో పాటు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మారుగొండ రాము, ముడుసు సత్యనారాయణ, అల్లోల గౌతంరెడ్డి, మంత్రి కుటుంబ సభ్యులు, కౌన్సిలర్లు క్యాంపు కార్యాలయంలో జరిగిన పతాకావిష్కరణలో పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising