మొరాయిస్తున్న స్వర్ణ గేటు
ABN, First Publish Date - 2023-07-29T01:56:32+05:30
మండలంలోని స్వర్ణగేటు మొరాయించింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా నీటి పారుదలశాఖ అధికారులు ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో ప్రాజెక్టుకు చెందిన పలు వరద గేట్లను ఎత్తివేశారు.
సారంగాపూర్, జూలై 28 : మండలంలోని స్వర్ణగేటు మొరాయించింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా నీటి పారుదలశాఖ అధికారులు ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో ప్రాజెక్టుకు చెందిన పలు వరద గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో తగ్గడంతో ఎత్తిన గేట్లను దించే ప్రయత్నం చేయగా ఒక వరద గేటు దిగకపోవడం వల్ల విలువైన సాగునీరు వృథాగా పోతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం మొత్తం 1183 అడుగులకు గాను గేటు మొరాయిస్తుండడంతో 1173 అడుగులకు చేరుకుందని ఆయకట్టు రైతులు తెలిపారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద గేట్ల విషయంలో ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2023-07-29T01:56:32+05:30 IST