నీటీఎద్దడి నివారణకు ముందు జాగ్రత్తలు చేపట్టాలిఐ జడ్పీటీసీ కోవ అరుణ
ABN, First Publish Date - 2023-03-02T23:03:48+05:30
సిర్పూర్(యు), మార్చి 2: ఎండకాలం సమీపి స్తోందని అధికారులు నీటిఎద్దడి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జడ్పీటిసీ కోవ అరుణ అన్నారు. గురువారం ఎంపీ డీవో కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్‌భగీరథ, పంచాయితీ కార్యదర్శులతో ప్రత్యేకసమావేశం నిర్వహించారు.
సిర్పూర్(యు), మార్చి 2: ఎండకాలం సమీపి స్తోందని అధికారులు నీటిఎద్దడి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జడ్పీటిసీ కోవ అరుణ అన్నారు. గురువారం ఎంపీ డీవో కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్‌భగీరథ, పంచాయితీ కార్యదర్శులతో ప్రత్యేకసమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జడ్పీటీసీ కోవ అరుణ, ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ ఎండాకాలం సమీపిస్తోందని అధి కారులు నీటి ఎద్దడి ప్రాంతాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లీకేజీలు ఉన్న చోట మరమ్మతులు చేయాలన్నారు. పెళ్లిళ్లకు నీటీ సమస్య లేకుండా గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసుదన్ అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T23:10:55+05:30 IST