అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN, First Publish Date - 2023-04-23T22:42:34+05:30
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు బాల్క సుమన్ సిద్ధంగా ఉండాలని, అధికారం చేపట్టిన విద్యార్థి నేత బూటకపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ బాధ్యులు అందుగుల శ్రీనివాస్ అన్నారు.
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 23 : చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు బాల్క సుమన్ సిద్ధంగా ఉండాలని, అధికారం చేపట్టిన విద్యార్థి నేత బూటకపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ బాధ్యులు అందుగుల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసే సత్తా సుమన్‌కు లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నాయకులపై అనవసరపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో ఉండే సుమన్ అత్తగారి ఇంటికి వచ్చినట్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి అంటూ శిలాఫలకాలు ప్రారంభించడమే తప్ప చేసిందేమి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు, సుమన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. గదె ్దరాగడిలోని పలు కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపా లిటీ అధ్యక్షుడు మహాంకాలి శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేష్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి అరిగెల రవిందర్, మందమర్రి ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా క్యాతన్‌పల్లి అధ్యక్షుడు బంగారు ప్రసాద్, మందమర్రి పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు ఓరుగంటి సురేందర్, ప్రధాన కార్యదర్శి గుండేటి శషి, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-04-23T22:42:34+05:30 IST