ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడెం గ్రామానికి చెందిన బాలింత రక్తస్రావంతో మృతి

ABN, First Publish Date - 2023-01-09T22:25:12+05:30

చింతలమానేపల్లి, జనవరి 9: మండలంలోని గూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం గ్రామానికి చెందిన దిగిడే శ్రీను భార్య శోభ(32)కు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌లో ఆమెను కౌటాల ప్రభుత్వఆస్పత్రికి తరలించే క్రమంలో తలోడి వద్ద ప్రసవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, జనవరి 9: మండలంలోని గూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం గ్రామానికి చెందిన దిగిడే శ్రీను భార్య శోభ(32)కు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌లో ఆమెను కౌటాల ప్రభుత్వఆస్పత్రికి తరలించే క్రమంలో తలోడి వద్ద ప్రసవించింది. రక్తస్రావం అధికం కావడంతో వెంటనే కౌటాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా పుట్టిన శిశువు ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో కాగజ్‌ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో కౌటాల ప్రభుత్వ ఆస్పత్రి నుంచి శనివారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి ఆదివారం రాత్రి 7గంటలకు మృతిచెందగా శిశువు రాత్రి9 గంటలకు ఫిట్స్‌ వచ్చి కాగజ్‌నగర్‌ ఆస్పత్రిలో మృతిచెందాడు. కాగా మృతు రాలికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులో బిడ్డ చనిపోయింది. ఐదో కాన్పులో తల్లీ పుట్టిన కుమారుడు ఇద్దరూ మృతిచెందడంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - 2023-01-09T22:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising