21న సింగరేణి కార్మికులకు రూ.1,726 కోట్లు
ABN, First Publish Date - 2023-09-14T04:20:21+05:30
సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలను ఈ నెల 21న చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో 42,733 మంది వరకున్న కార్మికులు, ఉద్యోగులకు సగటున రూ.2.80 లక్షల నుంచి రూ.3.08 లక్షల దాకా అందనుంది.
11వ వేజ్‌బోర్డు బకాయిలు చెల్లించనున్న సంస్థ
సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలను ఈ నెల 21న చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో 42,733 మంది వరకున్న కార్మికులు, ఉద్యోగులకు సగటున రూ.2.80 లక్షల నుంచి రూ.3.08 లక్షల దాకా అందనుంది. 11వ వేజ్‌బోర్డు 2021 జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి 2023 మే దాకా బకాయిల రూపంలో రూ.1,726 కోట్లను 21న కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని సింగరేణి నిర్ణయించింది. కొందరు ఎగువ శ్రేణి ఉద్యోగులకు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా బకాయిలు చేతికి రానున్నట్టు తెలిసింది.
Updated Date - 2023-09-14T04:20:21+05:30 IST