సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి 1450 కోట్లు
ABN, First Publish Date - 2023-09-22T02:37:01+05:30
వినాయక చవితి సందర్భంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో పడ్డాయి.
వేజ్‌బోర్డు బకాయిలను జమచేసిన యాజమాన్యం
త్వరలోనే దసరా, దీపావళి బోనస్: డైరెక్టర్ బలరామ్
హైదరాబాద్, రుద్రంపూర్ (సింగరేణి), సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో పడ్డాయి. గురువారం సింగరేణి భవన్ నుంచి కార్మికుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో 39 వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.1450 కోట్లను జమచేస్తూ సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్. బలరామ్ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా ఎరియర్స్ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఇన్‌కమ్ ట్యాక్స్, సీఎంపీఎ్‌ఫలో జమచేయాల్సిన సొమ్మును మినహాయించి, మిగిలిన మొత్తం కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోన్‌సనును చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వేతన బకాయిల్లో అత్యధికంగా రూ.9.91 లక్షలను రామగుండం ఏరియాకు చెందిన వేముల సుదర్శన్‌రెడ్డి అందుకోగా... ఆ తర్వాతి స్థానంలో రూ.9.35 లక్షలతో ఆపరేటర్ మీర్జా ఉస్మాన్‌బేగ్, మూడో స్థానంలో రూ.9.16లక్షలతో హెడ్‌ఓవర్ మెన్‌గా పనిచేస్తున్న ఆడెపు రాజమల్లు ఉన్నారు.
Updated Date - 2023-09-22T02:37:01+05:30 IST