ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఔటర్‌పై రయ్‌ రయ్‌..!

ABN, First Publish Date - 2023-08-02T04:31:05+05:30

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాల సంఖ్యతో పాటు ప్రమాదాలూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమయ్యారు.

1, 2 లేన్లలో 120 కి.మీ. వేగం.. కనీసం 80 కి.మీ.

3, 4 వరసల్లో 80 కి.మీ. వేగం.. కనీసం 40 కి.మీ. ఉండాల్సిందే

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఉల్లంఘిస్తే వాహనదారులపై చర్యలు

సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరికలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాల సంఖ్యతో పాటు ప్రమాదాలూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఔటర్‌పై వెళ్లే వాహనాలు, వాహనదారుల భద్రత, రోడ్డుపై వెళ్తున్న వాహన డ్రైవర్లు అయోమయానికి గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాసేజ్‌ దారులు, డ్రైవింగ్‌లో క్రమశిక్షణ పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీగా చలానాలు విధించడమే కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఔటర్‌పై లేన్‌-1, 2లో వెళ్లే వాహనాల వేగపరిమితిని గంటకు 100 నుంచి 120 కి.మీ.కి పెంచారు. ఈ లేన్లలో కనీస వేగం 80 కి.మీ. ఉండాలని స్పష్టం చేశారు.

లేన్‌-3, 4లో అధిక వేగం 80 కి.మీ. కాగా, కనీస వేగం 40 కి.మీ. ఉండాల్సిందే. అంత కంటే తక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు ఔటర్‌పై అనుమతి లేదు.

అతి వేగంగా వెళ్లే వాహనాలు.. వాటికి కేటాయించిన లేన్ల (1, 2)లోనే వెళ్లాల్సి ఉంటుంది. తక్కువ వేగం వాహనాలు, భారీ వాహనాలు వారికి కేటాయించిన లేన్లలో (3, 4) వెళ్లాలి.

లేన్‌ మారే సమయంలో వాహనదారులు వేగ పరిమితిని బట్టి ఇండికేటర్ల సాయంతో క్రమంగా మారిపోవాలి. జిగ్‌జాగ్‌గా వెళ్లరాదు. ఎక్కడా వాహనాలను నిలపడం, ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి వాటికి అనుమతి లేదు. పాదచారులకూ అనుమతి ఉండదు.

ఎమర్జెన్సీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా ఎడమవైపు (సర్వీస్‌ లేన్‌) వాహనాన్ని ఆపివేయాలి. హజార్డ్‌, పార్కింగ్‌ లైట్లను ఆన్‌ చేయాలి. సెవెన్‌ సీటర్‌ ఆటోలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఔటర్‌పై అనుమతి లేదు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఎగ్జిట్‌ రోడ్‌ నుంచి లోపలికి, ఎంట్రీ రోడ్‌ నుంచి బయటకు ప్రవేశించరాదని సీపీ తెలిపారు.

Updated Date - 2023-08-02T04:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising