WhatsApp Multiple Accounts: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై సింగిల్ యాప్‌లోనే మల్టిపుల్ అకౌంట్స్
ABN, First Publish Date - 2023-08-11T17:09:24+05:30
వినియోగదారులకు వాట్సాప్ వినియోగం మరింత సులభతరం చేసేందుకు.. మెటా సంస్థ రకరకాల ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పోటీ తీవ్రతరమైన తరుణంలో.. తన యూజర్స్‌ని కోల్పోకుండా ఉండేందుకు కొత్త కొత్త ఫీచర్స్‌తో అబ్బురపరుస్తూ వస్తోంది. రీసెంట్‌గానే ఇన్‌స్టంట్ వీడియో కాల్, చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్స్‌ని తీసుకొచ్చింది.
వినియోగదారులకు వాట్సాప్ వినియోగం మరింత సులభతరం చేసేందుకు.. మెటా సంస్థ రకరకాల ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పోటీ తీవ్రతరమైన తరుణంలో.. తన యూజర్స్‌ని కోల్పోకుండా ఉండేందుకు కొత్త కొత్త ఫీచర్స్‌తో అబ్బురపరుస్తూ వస్తోంది. రీసెంట్‌గానే ఇన్‌స్టంట్ వీడియో కాల్, చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్స్‌ని తీసుకొచ్చింది.
అయితే.. ఇన్ని ఫీచర్స్ వస్తున్నప్పటికీ, ఒక్క విషయంలో యూజర్లు కాస్త నిరాశలోనే ఉన్నారు. అదే.. ఒకే యాప్‌లో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్స్ వినియోగించే ఫీచర్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో ఈ మల్టిపుల్ అకౌంట్స్ ఫీచర్ ఉంది కానీ.. వాట్సాప్‌కి మాత్రం లేదు. దీంతో.. రెండు సిమ్ కార్డ్స్ ఉన్న వాళ్లు క్లోన్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమో లేదా ఇతర ఫోన్‌లో మరో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడమో చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కష్టానికి మెటా సంస్థ చెక్ పెట్టబోతోంది. ఒకే యాప్‌లోనే మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే సౌలభ్యాన్ని త్వరలోనే తీసుకువస్తోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.
ఆల్రెడీ ఈ ఫీచర్ కొంతమంది బెటా కస్టమర్లకు అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో క్రమంగా ఇది అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్లు ఒకే వాట్సాప్‌లోనే మల్టిపుల్ అకౌంట్స్‌ని సృష్టించుకోవచ్చు. QR కోడ్ వద్ద ఉన్న ఆరో (arrow) ఐకాన్‌ని టచ్ చేసి.. కొత్త అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అకౌంట్స్ సృష్టించుకున్నాక.. నోటిఫికేషన్స్ కూడా వేటికవే ప్రత్యేకంగా వస్తాయి. ఒకే యాప్‌లో ప్రైవేట్ చాట్‌లు, వర్క్ సంభాషణలు, ఇతర సందేశాలను ఏకీకృతం చేయడంలోనూ ఈ కొత్త ఫీచర్ సహకరిస్తుంది.
మరోవైపు.. వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ని సైతం వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు.. మీ స్క్రీన్‌ని ఫోన్ లేదా కంప్యూలర్ డిస్‌ప్లేను అందరూ చూసేలా షేర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా.. మీ ఫోన్‌లోని సమాచారం మొత్తం ఇతరులు వీక్షించొచ్చు. అయితే.. ఈ ఫీచర్ ఎక్కువగా ఆఫీస్ మీటింగ్స్‌కి చక్కని టూల్ అని చెప్పుకోవచ్చు.
Updated Date - 2023-08-11T17:09:24+05:30 IST