ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌శాఖకు 9,599 కోట్లు

ABN, First Publish Date - 2023-02-07T04:25:05+05:30

పోలీసు శాఖకు 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9,599 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్‌లో అతిస్వల్పంగా పెరుగుదల ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖకు 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9,599 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్‌లో అతిస్వల్పంగా పెరుగుదల ఉంది. ఈ శాఖకు నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. గత ఏడాది రూ.7,847 కోట్లున్న నిర్వహణ వ్యయం ఈసారి రూ.8,728 కోట్లకు చేరింది. ప్రగతి పద్దులో కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తి కావడం, జిల్లా పోలీస్‌ కార్యాలయాల భవనాల నిర్మాణం పూర్తికావడం ప్రగతి పద్దులో తగ్గుదలకు కారణం. ప్రగతి పద్దు గతేడాది రూ.1,468 కోట్లు ఉండగా.. ఈసారి ప్రభుత్వం కేవలం రూ.871.24 కోట్లు కేటాయించింది. శాఖాధిపతికి రూ.474.85 కోట్లు కేటాయించింది. ఇటీవల వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో వీటి నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రమాదాల నివారణ, తక్షణ సహాయ చర్యల్లో భాగంగా అగ్నిమాపక శాఖ అధునికీకరణ, కొత్త యంత్రాలు, పరికరాల కొనుగోలుకు అగ్నిమాపక శాఖకు రూ.32 కోట్లు కేటాయించింది. ఎన్నికల ఏడాది కావడంతో నిఘా విభాగానికి రూ.72 కోట్లు కేటాయించింది.

Updated Date - 2023-02-07T04:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising