ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెజ్లర్లకు ‘1983’ హీరోల మద్దతు

ABN, First Publish Date - 2023-06-03T01:13:52+05:30

బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న భారత రెజ్లర్లకు 1983 వన్డే ప్రపంచకప్‌ జట్టు ఆటగాళ్లు మద్దతు పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న భారత రెజ్లర్లకు 1983 వన్డే ప్రపంచకప్‌ జట్టు ఆటగాళ్లు మద్దతు పలికారు. అలాగే కేంద్రం స్పందించకపోతే తమ పతకాలను గంగానదిలో కలిపేస్తామనే హెచ్చరికను వెనక్కి తీసుకోవాలని కపిల్‌ నేతృత్వంలోని ఆటగాళ్ల బృందం ఓ ప్రకటనలో కోరింది. ‘రెజ్లర్లతో పోలీసుల దురుసు ప్రవర్తన బాధ కలిగించింది. అలాగే కఠోర శ్రమతో సాధించిన పతకాలను గంగా నదిలో కలిపేయాలన్న వారి ఆలోచన కూడా మమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే ఆ పతకాల సాధన వెనుక ఎంతో శ్రమ, త్యాగం ఉన్నాయి. అవి వారికి గుర్తింపును తేవడమే కాకుండా, ఈ దేశ ప్రతిష్ఠ కూడా వాటిలో ఇమిడి ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ విషయంలో రెజ్లర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయమూ తీసుకోకూడదు. అలాగే వారి డిమాండ్‌కు వీలైనంత త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. చట్టం తన పని తాను చేస్తుంది’ అని వారు రెజ్లర్లకు తమ మద్దతును తెలియజేశారు.

Updated Date - 2023-06-03T01:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising