ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీస్‌ 258/5.. దక్షిణాఫ్రికా 259/4 టీ20ల్లో ప్రపంచ రికార్డు

ABN, First Publish Date - 2023-03-27T03:44:48+05:30

పరుగుల జడివాన..కాదు..కాదు..సునామీ. ఫలితంగా రికార్డులు వెల్లువెత్తాయి. దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 ఇందుకు వేదికైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డికాక్‌ మెరుపు సెంచరీ జూ జాన్సన్‌ శతకం వృథా

సెంచూరియన్‌: పరుగుల జడివాన..కాదు..కాదు..సునామీ. ఫలితంగా రికార్డులు వెల్లువెత్తాయి. దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 ఇందుకు వేదికైంది. 258 రన్స్‌ చేసి గెలుపు ధీమాలో ఉన్న కరీబియన్లకు సౌతాఫ్రికా ఓపెనర్‌ డికాక్‌ సూపర్‌ సెంచరీతో షాకిచ్చాడు. తొలుత 20 ఓవర్లలో వెస్టిండీస్‌ 258/5 స్కోరు చేసింది. జాన్సన్‌ చార్లెస్‌ (46 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్స్‌లతో 118) మెరుపు సెంచరీ కొట్టాడు. కైల్‌ మేయర్స్‌ (27 బంతుల్లో 51), షెప్పర్డ్‌ (41 నాటౌట్‌) చెలరేగారు. ఇక డికాక్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) ఆకాశమే హద్దుగా చెలరేగగా..అతడికి హెన్‌డ్రిక్స్‌ (28 బంతుల్లో 68) సహకరించాడు. దాంతో 18.5 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 259/4 స్కోరుతో తిరుగులేని విజయం అందుకుంది. తద్వారా అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.

ఇవీ రికార్డులు..

  • రెండు జట్లు కలిపి చేసిన 517 పరుగులు ఓ టీ20 పోరులో అత్యధికం.

  • రెండు జట్లు కలిసి 35 సిక్సర్లు బాదాయి. ఓ ఇంటర్నేషనల్‌ టీ20లో ఇవే అత్యధిక సిక్సర్లు.

  • తొలి పది ఓవర్లలో అత్యధిక (149) రన్స్‌తో ప్రపంచరికార్డు

  • నెలకొల్పిన దక్షిణాఫ్రికా.

Updated Date - 2023-03-27T03:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising