ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vinesh Phogat: బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు.. జంతర్ మంతర్ వద్దకు వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా

ABN, First Publish Date - 2023-04-23T19:00:24+05:30

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు (WFI) బ్రిజ్ భూషణ్ శరణ్‌(Brij Bhushan Sharan)పై ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు (WFI) బ్రిజ్ భూషణ్ శరణ్‌(Brij Bhushan Sharan)పై ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన ఢిల్లీ పోలీసులపై రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా(Bajrang Punia), సాక్షి మాలిక్(Sakshi Malik) వంటి వారు జనవరిలో ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ధర్నాకు దిగారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మళ్లీ అదే వేదిక వద్ద ధర్నా చేయాలని రెజర్లు నిర్ణయించారు.

దేశానికి గౌరవ ప్రతిష్ఠలు తీసుకొచ్చిన పలువురు మహిళా రెజర్లు లైంగిక వేధింపులకు గురయ్యారని, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ వారిని వేధించారంటూ ఫొగట్ ట్వీట్ చేసింది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై ఈ నెల 21న బాధిత రెజర్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

బ్రిజ్ భూషణ్ ఏళ్ల తరబడి మహిళా రెజర్లను వేధిస్తున్నారని వినేశ్ ఫొగట్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం దర్యాప్తు కోసం యోగేశ్వర్ దత్, మేరీ కోమ్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా ఆదేశించింది.

అప్పట్లో బ్రిజ్‌భూషణ్ మాట్లాడుతూ.. రెజర్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నట్టు తెలిసిందని, అయితే వారి ఆరోపణల గురించి తనకు తెలియదని అన్నారు. అంతేకాదు, అలాంటి ఆరోపణల (లైంగిక వేధింపులు)తో ఎవరైనా ముందుకొచ్చారా? అని ప్రశ్నించారు. అలా వచ్చిన వారు ఎవరైనా ఫెడరేషన్ అధ్యక్షుడు లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పారా? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-04-23T19:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising