ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World Boxing Celebrations : ఆరంభం అదిరింది

ABN, First Publish Date - 2023-03-16T03:50:30+05:30

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప ఆరంభోత్సం బుధవారం ఇందిరా గాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు అంతర్జాతీయ బాక్సింగ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఘనంగా ప్రపంచ బాక్సింగ్‌ వేడుకలు

నేటినుంచి పోటీలు

న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప ఆరంభోత్సం బుధవారం ఇందిరా గాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్‌ క్రమలేవ్‌, భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోటీలను ప్రారంభిస్తున్నట్టు ఠాకూర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానం నుంచి భారత్‌ 3వ స్థానానికి చేరుకొందని కొనియాడారు. ఇక, వేడుకల్లో 65 దేశాలకు చెందిన బాక్సర్లు స్టేజ్‌పై పరేడ్‌ నిర్వహించారు. భారత్‌ తరఫున లవ్లీనా పతాకధారిగా వ్యవహరించగా.. తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఆమెను అనుసరించింది. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. టోర్నీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌తోపాటు బాలీవుడ్‌ నటుడు ఫరాన్‌ అక్తర్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రష్యా క్రీడా మంత్రి ఒలేగా మిటిట్‌సిన్‌ ఈవెంట్‌లో ఆకర్షణగా నిలిచారు. గురువారం నుంచి బౌట్‌లు జరగనుండగా.. ఈనెల 26న ఈవెంట్‌ ముగియనుంది.

నిఖత్‌కు సవాల్‌.. లవ్లీనా, సవీటికి బై: టోర్నీలో డిఫెండింగ్‌ చాంప్‌ నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు)కు కఠినమైన డ్రా ఎదురైంది. ఆరంభరౌండ్‌లో అనఖనిమ్‌ ఇస్మెయిలొవా (అజర్‌బైజాన్‌)తో తలపడనున్న నిఖత్‌ తదుపరి రౌండ్‌లో టాప్‌సీడ్‌ బౌవాలమ్‌ రౌమేసా (అల్గేరియా)తో ఆడాల్సి ఉంటుంది. ఈ రౌండ్లను దాటితే సెమీస్‌, ఫైనల్లో ఒలింపిక్‌ పతక విజేతలు వేలన్సియా (కొలంబియా), సుకుమి నమికి (జపాన్‌) ఎదురవ్వొచ్చు. ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గాహైన్‌ (75 కి), సవీటి బోరా (81 కి)లకు తొలి రౌండ్‌లో బై లభించింది.

Updated Date - 2023-03-16T03:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising