ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందుకే స్వర్ణం చేజారింది!

ABN, First Publish Date - 2023-10-27T02:28:15+05:30

దుస్తుల సమస్య కారణంగా ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌ప్స 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో భారత జూనియర్‌ జట్టు ‘రికార్డు’ స్వర్ణం కోల్పోయింది!...

న్యూఢిల్లీ: దుస్తుల సమస్య కారణంగా ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌ప్స 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో భారత జూనియర్‌ జట్టు ‘రికార్డు’ స్వర్ణం కోల్పోయింది! కొరియాలోని చాంగ్వాన్‌లో జరుగుతున్న ఈ పోటీలలో ఉమామహేశ్‌ మద్దినేని, ధనుష్‌ శ్రీకాంత్‌, అభినవ్‌ షాతో కూడిన భారత జట్టు 1882 పాయింట్లు స్కోరు చేసింది. వాస్తవంగా ఈ జూనియర్‌ ఆసియా రికార్డు స్కోరుతో మన జట్టుకు స్వర్ణ పతకం లభించేది. కానీ ధనుష్‌ శ్రీకాంత్‌ నిర్ణీత ప్రమాణాలతో కూడిన ‘ట్రౌజర్‌’ ధరించలేదంటూ నిర్వాహకులు అతడిని డిస్‌క్వాలిఫై చేశారు. ఫలితంగా భారత జట్టు పసిడి పతకం చేజార్చుకుంది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య నిబంధనల మేరకు పోటీలలో షూటర్‌ వేసుకొనే ట్రౌజర్‌ మందం 3.0. కంటే తక్కువ ఉండకూడదు. కానీ ధనుష్‌ ధరించిన ట్రౌజర్‌ మందం 2.9 ఉండడంతో అతడిపై అనర్హత వేటు వేశారు.

Updated Date - 2023-10-27T02:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising