ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sathvik Pair: సాత్విక్‌ జోడీకి స్విస్‌ ఓపెన్‌

ABN, First Publish Date - 2023-03-27T02:43:08+05:30

ఓవైపు స్వదేశంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌పలో స్వర్ణాలతో బాక్సర్లు సత్తాచాటగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌, ముంబై షట్లర్‌ చిరాగ్‌ శెట్టి స్విట్జర్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఓవైపు స్వదేశంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌పలో స్వర్ణాలతో బాక్సర్లు సత్తాచాటగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌, ముంబై షట్లర్‌ చిరాగ్‌ శెట్టి స్విట్జర్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో విజయబావుటా ఎగురవేసి భారత అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఈ జంట ఫైనల్లో 21-19, 24-22తో చైనాకు చెందిన రెన్‌ జియాంగ్‌, తాన్‌ క్వియాంగ్‌ జోడీని ఓడించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లాంటి స్టార్లు ఆరంభరౌండ్లలోనే వెనుదిరిగినా.. సాత్విక్‌, చిరాగ్‌ జోడీ అసమాన ప్రదర్శనతో ఆకట్టుకొని ఫలితాన్ని రాబట్టింది.

అదరగొట్టిన సాత్విక్‌

స్విస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ కైవసం

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను తెలుగు కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ద్వయం కొల్లగొట్టింది. వరల్డ్‌ నెంబర్‌-6.. సాత్విక్‌ జోడీ స్విస్‌ ఓపెన్‌ నెగ్గడం ఇదే తొలిసారి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 21-19, 24-22తో రెన్‌ జియాంగ్‌ యు-టాన్‌ కియాంగ్‌ (చైనా)పై విజయం సాధించి, కెరీర్‌లో ఐదో వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 54 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన తుది పోరులో చైనా జోడీని ఓడించేందుకు సాత్విక్‌-చిరాగ్‌ చెమటోడ్చాల్సి వచ్చింది.

తొలి గేమ్‌ ప్రారంభంలో భారత జోడీ బుల్లెట్‌ వంటి సర్వీస్‌లు, మెరుపు స్మాష్‌లకు రెన్‌-టాన్‌ ద్వయం తడబడింది. వారు తేరుకునే లోపు సాత్విక్‌ జోడీ 18-13 స్కోరుతో తొలి గేమ్‌పై పట్టు సాధించి సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన చైనా జోడీ పాయింట్‌ టూ పాయింట్‌ సాధిస్తూ 16-16 స్కోరు వరకు తీవ్రమైన పోటీ ఇచ్చింది. ఇక్కడ నుంచి సాత్విక్‌ జోడీ పొరపాట్లకు తావివ్వకుండా దూకుడుగా ఆడడంతో భారత్‌ను విజయం వరించింది. ఈ ఏడాది భారత్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ కావడం విశేషం.

Updated Date - 2023-03-27T02:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising