ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘రెజ్లింగ్‌’ ఎన్నికలపై స్టే

ABN, First Publish Date - 2023-06-26T00:53:47+05:30

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) ఎన్నికలు.. మరింత ఆలస్యం కానున్నాయి. కారణం..వచ్చేనెల 11న జరగాల్సిన ఈ ఎన్నికలపై గువాహతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహతి: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) ఎన్నికలు.. మరింత ఆలస్యం కానున్నాయి. కారణం..వచ్చేనెల 11న జరగాల్సిన ఈ ఎన్నికలపై గువాహతి హైకోర్టు స్టే ఇవ్వడమే. తాము డబ్ల్యూఎ్‌ఫఐకి అనుబంధమే అయినా.. తమకు గుర్తింపు ఇవ్వలేదని అసోం రెజ్లింగ్‌ సంఘం కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు డబ్ల్యూఎ్‌ఫఐ, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ), అడ్‌హాక్‌ కమిటీ, కేంద్ర క్రీడా శాఖపై పిటిషన్‌ వేసింది. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ, ఐఓఏ, క్రీడాశాఖలకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 17కు వాయిదావేసింది. అప్పటిదాకా ఎన్నికలు జరపకూడదని ఆదేశించింది.

‘ట్రయల్స్‌ కోరలేదనేందుకు ఇదిగో రుజువు’

ఆసియా క్రీడల ట్రయల్స్‌ నుంచి తమను మినహాయించాలని కోరలేదని తెలిపే రుజువును రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ ఆదివారం విడుదలజేసింది. ట్రయల్స్‌కు సన్నద్ధమయ్యేందుకు తమకు ఆగస్టు దాకా సమయమివ్వాలని క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు రాసిన లేఖను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘రెజ్లింగ్‌ బౌట్లను కావాలని ఓడిపోవాలని యోగేశ్వర్‌ దత్‌ తనను గతంలో పలుమార్లు కోరాడు’ అని బజ్‌రంగ్‌ పూనియా చేసిన ఆరోపణను ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత యోగేశ్వర్‌ ఖండించాడు. పూనియా అబద్ధం చెబుతున్నాడని అన్నాడు.

Updated Date - 2023-06-26T00:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising