ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీఫైనల్స్‌కు సింధు, ప్రణయ్‌

ABN, First Publish Date - 2023-05-27T03:52:25+05:30

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలాలంపూర్‌: స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక, మరో ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రణయ్‌ 25-23, 18-21, 21-13తో జపాన్‌కు చెందిన కెంటా నిషిమొటోను ఓడించాడు. మరో క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21-16, 16-21, 11-21తో ఇండోనేసియా క్వాలిఫయర్‌ క్రిస్టియన్‌ అదినాత చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్‌ బెర్త్‌ కోసం క్రిస్టియన్‌తో ప్రణయ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు 21-16, 13-21, 22-20తో చైనా షట్లర్‌ యి మాన్‌ జాంగ్‌పై పోరాడి గెలుపొందింది.

Updated Date - 2023-05-27T03:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising