ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్ల్‌సన్‌కు షాక్‌

ABN, First Publish Date - 2023-06-26T00:43:04+05:30

వరల్డ్‌ చెస్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌లో ఎస్‌జీ ఆల్‌పైన్స్‌ వారియర్‌ ఐకాన్‌ ఆటగాడు, వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాక్‌ తగిలింది. అప్‌గ్రాడ్‌ ముంబై మాస్టర్స్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ వాషిర్‌ లగ్రేవ్‌ 42 ఎత్తుల్లో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌

దుబాయ్‌: వరల్డ్‌ చెస్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌లో ఎస్‌జీ ఆల్‌పైన్స్‌ వారియర్‌ ఐకాన్‌ ఆటగాడు, వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాక్‌ తగిలింది. అప్‌గ్రాడ్‌ ముంబై మాస్టర్స్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ వాషిర్‌ లగ్రేవ్‌ 42 ఎత్తుల్లో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఈ పోరులో ఆల్‌పైన్స్‌ 8-7తో గెలుపొందింది. ఆల్‌పైన్స్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి-జీఎం విదిత్‌ శరణ్‌తో గేమ్‌ డ్రా అయింది. అలాగే అప్‌గ్రాడ్‌కు ఆడుతున్న జీఎంలు కోనేరు హంపి, హారిక కూడా తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. మరో ఐదో రౌండ్‌ గేమ్‌లో చింగారి గల్ఫ్‌ టైటాన్స్‌ 15-3తో బాలన్‌ అలాస్కన్‌ నైట్స్‌పై నెగ్గింది. ఇక వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న గ్యాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌కు అంతకుముందు జరిగిన నాలుగో రౌండ్‌లో బ్రేక్‌ పడింది. ఆనంద్‌ విజయం సాధించినా మిగిలిన ఆటగాళ్లు ఆశించిన మేర రాణించకపోవడంతో..గ్యాంజెస్‌ 6-11తో అప్‌గ్రాడ్‌ ముంబై మాస్టర్స్‌ చేతిలో చిత్తయింది. మరో నాలుగో రౌండ్‌ పోరులో ఎస్‌జీ ఆల్‌పైన్‌ వారియర్స్‌ 11-6తో చింగారి గల్ఫ్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది.

Updated Date - 2023-06-26T00:43:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising