Sania Mirza: సానియా మ్యాచ్ నేటికి వాయిదా
ABN, First Publish Date - 2023-02-21T03:26:10+05:30
కెరీర్ చివరి టోర్నీలో భాగంగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా దుబాయ్ డ్యూటీ ఫ్రీ చాంపియన్‌షి్‌పలో పాల్గొంటోంది.
దుబాయ్: కెరీర్ చివరి టోర్నీలో భాగంగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా దుబాయ్ డ్యూటీ ఫ్రీ చాంపియన్‌షి్‌పలో పాల్గొంటోంది. అమెరికన్ టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ జతగా సానియా ఈ టోర్నీ డబుల్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సానియా, కీస్ సోమవారంనాటి తొలి రౌండ్ మ్యాచ్‌లో రష్యా ద్వయం కుడెర్మెటోవా/సమ్‌సొనోవాతో తలపడాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో మ్యాచ్‌ను మంగళవారంనాటికి వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. 36 ఏళ్ల సానియా..ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో అన్నా డాలినినా (రష్యా)తో కలిసి మహిళల డబుల్స్ బరిలో దిగిన సానియా రెండో రౌండ్‌వరకూ చేరింది. ఇక మరో భారత డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్‌లో తలపడిన సానియా ఫైనల్ వరకు దూసుకొచ్చి రన్నర్‌పగా గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ఘనంగా ముగించింది.
Updated Date - 2023-02-21T03:26:10+05:30 IST