Bajrang: ‘వరల్డ్’ ట్రయల్స్‌కు వచ్చెయ్!
ABN, First Publish Date - 2023-08-22T03:02:37+05:30
ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సనకు నిర్వహించే ఎంపిక పోటీలకు హాజరు కావాలని ఒలింపిక్ పతక విజేత బజ్‌రంగ్ పూనియాకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సూచించింది.
బజ్‌రంగ్‌కు సాయ్ సూచన
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సనకు నిర్వహించే ఎంపిక పోటీలకు హాజరు కావాలని ఒలింపిక్ పతక విజేత బజ్‌రంగ్ పూనియాకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సూచించింది. ఒకవేళ సెలెక్షన్స్ నుంచి మినహాయింపు కావాలంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశించింది. ఈనెల 25, 26 తేదీల్లో పటియాలాలో ఈ ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి బదులు ఆసియా క్రీడలకు సన్నాహకాల్లో భాగంగా విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని పూనియా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి సాయ్ ఈ సూచన చేసింది. ఆసియా క్రీడలు సెప్టెంబరు 23 నుంచి చైనాలోని హాంగ్‌ఝౌలో జరగనున్న సంగతి తెలిసిందే.
Updated Date - 2023-08-22T03:02:37+05:30 IST