ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్వార్టర్స్‌కు హారిక

ABN, First Publish Date - 2023-08-12T01:52:37+05:30

చెస్‌ వరల్డ్‌క్‌పలో గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోగా.. కోనేరు హంపి ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

హంపి అవుట్‌

రెండోసీడ్‌ నకమురకు

ప్రజ్ఞానంద షాక్‌

బాకు (అజర్‌బైజాన్‌): చెస్‌ వరల్డ్‌క్‌పలో గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోగా.. కోనేరు హంపి ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌ రౌండ్‌ టైబ్రేక్‌లో ఎలిన్‌ రోబర్స్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన రెండు గేముల్లో ఒకటి డ్రా చేసుకొన్న హారిక.. రెండో గేమ్‌లో నెగ్గింది. దీంతో హారిక 2.5-1.5తో పైచేయి సాధించి ముందంజ వేసింది. కాగా, బెల్లా కొటెనా్‌షవిల్లీ (జార్జియా)తో రెండు టైబ్రేక్‌ గేముల్లోనూ హంపి పరాజయాన్ని చవిచూసింది. దీంతో మొత్తం 1-3 పాయింట్ల తేడాతో నాలుగో రౌండ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నాకౌటైంది. ఓపెన్‌ కేటగిరీలో అర్జున్‌ ఇరిగేసి ఐదో రౌండ్‌కు చేరుకొన్న సంగతి తెలిసిందే. కాగా, టోర్నీలో రెండోసీడ్‌, అమెరికా స్టార్‌ హికరు నకమురకు భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద షాకిచ్చాడు. నాలుగో రౌండ్‌ టైబ్రేక్‌ రెండు గేముల్లోనూ నకమురను చిత్తుచేసి ప్రజ్ఞానంద ప్రీక్వార్టర్స్‌ చేరాడు.

Updated Date - 2023-08-12T01:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising