ప్రభాత్ పాంచ్ పటాక
ABN, First Publish Date - 2023-04-18T04:07:46+05:30
ఐర్లాండ్‌తో తొలి టెస్ట్ రెండోరోజే శ్రీలంక పూర్తిగా పట్టుబిగించింది. లెఫ్టామ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/42) ఐదు వికెట్లతో చెలరేగడంతో
ఐర్లాండ్ 117/7
శ్రీలంకతో తొలి టెస్ట్
గాలె: ఐర్లాండ్‌తో తొలి టెస్ట్ రెండోరోజే శ్రీలంక పూర్తిగా పట్టుబిగించింది. లెఫ్టామ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/42) ఐదు వికెట్లతో చెలరేగడంతో ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో సోమవారం ఆఖరికి 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక తొలి ఇన్నింగ్స్‌ను 591/6 స్కోరుతో డిక్లేర్ చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 386/4తో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ కొనసాగించగా చాందిమల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) శతకాలతో దుమ్ము రేపారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 183 పరుగులు జోడించారు. ఫలితంగా ఆతిథ్య జట్టు 500కుపైగా స్కోరు చేయగలిగింది.
Updated Date - 2023-04-18T04:07:47+05:30 IST