ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓవరాల్‌ చాంపియన్లు హైదరాబాద్‌, రంగారెడ్డి

ABN, First Publish Date - 2023-06-01T00:30:05+05:30

మూడ్రోజులపాటు హైదరాబాద్‌ వేదికగా ఉత్సాహంగా సాగిన సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు సందడిగా ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మూడ్రోజులపాటు హైదరాబాద్‌ వేదికగా ఉత్సాహంగా సాగిన సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు సందడిగా ముగిశాయి. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, శాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌ పాల్గొని, క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. బాలుర విభాగంలో హైదరాబాద్‌ జిల్లా 89 పతకాలతో, బాలికల కేటగిరీలో రంగారెడ్డి జిల్లా 49 పతకాలతో ఓవరాల్‌ చాంపియన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి.

ఫలితాలు: పురుషుల ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌ విజేత. జోగులాంబ గద్వాల్‌ రన్నరప్‌. మహిళల్లో ఖమ్మం విజేత. నల్లగొండ రన్నరప్‌. మహిళల బాస్కెట్‌బాల్‌లో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి చాంపియన్‌, హైదరాబాద్‌ రన్నరప్‌; పురుషుల్లో హైదరాబాద్‌ విజేత, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి రన్నర్‌పగా నిలిచాయి. మహిళల కబడ్డీలో నల్లగొండ చాంపియన్‌, రంగారెడ్డి రన్నరప్‌, పురుషుల్లో సూర్యాపేట విజేత, రంగారెడ్డి రన్నరప్‌ స్థానాలను దక్కించుకున్నాయి.

Updated Date - 2023-06-01T00:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising