కివీస్‌కు రెండో విజయం
ABN, First Publish Date - 2023-10-03T00:57:31+05:30
న్యూజిలాండ్ రెండో వామప్ మ్యాచ్‌లోనూ గెలిచి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ పద్దతిన 7 పరుగులతో నెగ్గింది...
తిరువనంతపురం: న్యూజిలాండ్ రెండో వామప్ మ్యాచ్‌లోనూ గెలిచి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ పద్దతిన 7 పరుగులతో నెగ్గింది. ముందుగా కివీస్ 50 ఓవర్లలో 321/6 స్కోరు చేసింది. తర్వాత ప్రొటీస్ 37 ఓవర్లలో 211/4 స్కోరు వద్ద వర్షం రావడంతో మ్యాచ్ ఆగింది. అప్పటికి డక్‌వర్త్ పద్దతిన సఫారీలు 7 రన్స్ వెనుకంజలో ఉండడంతో కివీస్ విజేతగా నిలిచింది. వర్షంతో 37 ఓవర్లకు కుదించిన మరో వామప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ 4 వికెట్లతో నెగ్గింది. ముందుగా బంగ్లా 188/9 స్కోరు చేయగా, ఇంగ్లండ్ 24.1 ఓవర్లలో 197/6 స్కోరు చేసి గెలిచింది.
Updated Date - 2023-10-03T00:57:31+05:30 IST