Racing ; మోటార్ సైకిల్ రేసింగ్‌కు సర్వం సిద్ధం
ABN, First Publish Date - 2023-09-22T03:16:26+05:30
భారత్‌లో తొలి మోటార్ సైకిల్ రేసింగ్‌కు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇప్పటికే రైడర్లతో సందడిగా
నేటి నుంచి మోటో జీపీ భారత్ గ్రాండ్ ప్రీ
న్యూఢిల్లీ: భారత్‌లో తొలి మోటార్ సైకిల్ రేసింగ్‌కు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇప్పటికే రైడర్లతో సందడిగా మారిపోయింది. ఈ సర్క్యూట్ వేదికగా శుక్రవారం నుంచి మోటో జీపీ భారత్ గ్రాండ్ ప్రీ రేసు జరగనుంది. తొలిరోజు ప్రాక్టీస్ సెషన్, రెండోరోజైన శనివారం క్వాలిఫయింగ్ రేసులు జరుగు తాయి. ఆఖరి రోజైన ఆదివారం ఫైనల్ రేసు జరగనుంది. ఫాబియో క్వార్టరారో, అలెక్స్ ఎస్పార్గారో, ఫ్రాన్సెస్కో బగ్నాయాలాంటి అంతర్జాతీయ స్టార్ రైడర్లు ఈ గ్రాండ్ ప్రీలో పోటీపడనున్నారు.
Updated Date - 2023-09-22T03:16:26+05:30 IST