ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marcus Stoinis: జోర్డాన్‌కు చుక్కలు చూపించిన స్టోయినిస్.. ఒకే ఓవర్లో 24 పరగులు.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-05-17T12:18:49+05:30

ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఐపీఎల్‌లో తన జోరు చూపిస్తున్నాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి సత్తా చాటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) ఐపీఎల్‌లో (IPL 2023) తన జోరు చూపిస్తున్నాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి సత్తా చాటాడు. మంగళవారం సాయంత్రం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ (LSGvsMI) జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. చివరకు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ టాపార్డర్‌ విఫలం కావడంతో ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. లఖ్‌నవూ టీమ్ 150 రన్స్‌ సాధించడమే కష్టం అనిపించింది. అయితే ఆఖరి మూడు ఓవర్లలో స్టొయినిస్‌ బ్యాట్ ఝుళిపించడంతో జట్టు భారీ స్కోరు చేసింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో మొదట్లో స్టోయినిస్ నెమ్మదిగా ఆడాడు. కెప్టెన్ క్రునాల్‌తో (Krunal Pandya) కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. 18వ ఓవర్లో స్టోయినిస్ చెలరేగాడు. జోర్డాన్‌ (Chris Jordan) వేసిన ఈ ఓవర్‌లో స్టొయినిస్‌ 6,4,4,6,4తో 24 పరుగులు రాబట్టడంతో పాటు 36 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో 30 రన్స్‌ రావడంతో లఖ్‌నవూ 177 పరుగులు సాధించింది.

Surya Kumar Yadav: అన్ని సార్లూ కుదరదు సూర్య.. తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించి సూర్య ఎలా అవుటయ్యాడో చూడండి..

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై‌కు ఓపెనర్లు రోహిత్ (Rohit Sharma) (37), ఇషాన్ కిషన్ (59) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరి ధాటికి 11 ఓవర్లలో ముంబై 103 పరుగులు చేసింది. ముంబై గెలవడం సులభం అనుకున్న వేళ మ్యాచ్ టర్న్ అయింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ముంబై ఆట గతి తప్పింది. మధ్య ఓవర్లలో ఎల్‌ఎస్‌జీ బౌలర్లు పట్టు బిగించారు.

Updated Date - 2023-05-17T12:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising