Surya Kumar Yadav: అన్ని సార్లూ కుదరదు సూర్య.. తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించి సూర్య ఎలా అవుటయ్యాడో చూడండి..

ABN , First Publish Date - 2023-05-17T09:53:48+05:30 IST

దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తరహాలో మైదానం నలువైపులా ఆడుతూ మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. మైదానం నలువైపులా, ముఖ్యంగా వికెట్ల వెనుక వైపు సూర్య కొట్టే క్రియేటివ్ షాట్లు అద్భుతంగా కనెక్ట్ అవుతాయి.

Surya Kumar Yadav: అన్ని సార్లూ కుదరదు సూర్య.. తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించి సూర్య ఎలా అవుటయ్యాడో చూడండి..

దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ (AB de Villiers) తరహాలో మైదానం నలువైపులా ఆడుతూ మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav). మైదానం నలువైపులా, ముఖ్యంగా వికెట్ల వెనుక వైపు సూర్య కొట్టే క్రియేటివ్ షాట్లు అద్భుతంగా కనెక్ట్ అవుతాయి. సూర్య ట్రేడ్‌మార్క్ షాట్ అయిన స్కూప్ షాట్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతుంది. అయితే మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అదే కొంప ముంచింది. ఆ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సూర్య క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

మంగళవారం సాయంత్రం ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌ల మధ్య మ్యాచ్ (LSGvsMI) జరిగింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సూర్య తడబడ్డాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో యశ్ ఠాకూర్ (Yash Thakur) ఆఫ్ స్టంప్ అవతల వేసిన బంతికి స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి నేరుగా వికెట్ల పైకి వెళ్లడంతో సూర్య బౌల్డ్ అయ్యాడు. మొత్తం మీద 9 బంతులెదుర్కొన్న సూర్య 7 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

Nehal Wadhera: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ప్యాడ్స్‌తో నేహల్ వధేరా.. పనిష్మెంట్ విధించిన ముంబై మేనేజ్‌మెంట్.. ఎందుకంటే..

సూర్య అవుట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య అవుట్‌పై నెటిజన్లు స్పందించారు. ``ప్రతిరోజూ మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది``, ``క్రీజులోకి వచ్చిన వెంటనే అలాంటి షాట్లు ఆడితే ఎలా`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-17T09:53:48+05:30 IST