Nehal Wadhera: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ప్యాడ్స్‌తో నేహల్ వధేరా.. పనిష్మెంట్ విధించిన ముంబై మేనేజ్‌మెంట్.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-05-16T13:06:16+05:30 IST

ముంబై ఇండియన్స్ బ్యాటర్ నేహల్ వధేరా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ షాకిచ్చాడు. బ్యాటింగ్ ఆడేటపుడు కట్టుకునే ప్యాడ్స్‌తో నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అతడితో పాటు ముంబై టీమ్ సభ్యులు కూడా ఉన్నారు.

Nehal Wadhera: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ప్యాడ్స్‌తో నేహల్ వధేరా.. పనిష్మెంట్ విధించిన ముంబై మేనేజ్‌మెంట్.. ఎందుకంటే..

ముంబై ఇండియన్స్ (MI) బ్యాటర్ నేహల్ వధేరా (Nehal Wadhera) ముంబై ఎయిర్‌పోర్ట్‌లో (Mumbai airport) అందరికీ షాకిచ్చాడు. బ్యాటింగ్ ఆడేటపుడు కట్టుకునే ప్యాడ్స్‌తో నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అతడితో పాటు ముంబై టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. మిగత ఆటగాళ్లు సాధారణంగానే ఉండగా.. నేహల్ మాత్రం రెండు కాళ్లకు ప్యాడ్స్ కట్టుకుని విమానం ఎక్కాడు. ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ విధించిన పనిష్మెంట్ కారణంగానే నేహల్ అలా ప్యాడ్స్‌తో తిరుగుతున్నట్టు సమాచారం (Nehal Wadhera roaming with pads).

ఈ రోజు (మంగళవారం) సాయంత్రం లఖ్‌నవూ టీమ్‌తో ముంబై (MIvsLSG) తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం జరిగిన టీమ్ మీటింగ్‌కు నేహల్ వధేరా ఆలస్యంగా వెళ్లాడట. దీంతో ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ నేహల్‌కు ఈ శిక్ష విధించిందట. ఈ మ్యాచ్‌కు కోసం ముంబై టీమ్ లఖ్‌నవూ వెళ్లింది. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్లేవరకు నేహల్ ప్యాడ్స్‌తోనే ఉండాలనేది మేనేజ్‌మెంట్ ఇచ్చిన పనిష్మెంట్. దీంతో వధేరా దాన్ని పాటించక తప్పలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bhuvneshwar Kumar: వావ్.. చివరి ఓవర్లో భువనేశ్వర్ అద్భుతం.. ఎలాంటి బౌలింగ్ వేశాడో చూడండి..

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``మరోసారి నేహల్ ఆలస్యమైతే.. కెప్టెన్ రోహిత్ శర్మను ఎత్తుకుని రావాలంటారేమో``, ``పనిష్మెంట్ బాగుంది``, ``పాపం.. నేహల్`` అని కామెంట్లు చేస్తున్నారు. తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన నేహల్ వరుస అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు.

Updated Date - 2023-05-16T13:06:16+05:30 IST