Bhuvneshwar Kumar: వావ్.. చివరి ఓవర్లో భువనేశ్వర్ అద్భుతం.. ఎలాంటి బౌలింగ్ వేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-05-16T10:54:42+05:30 IST

టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడనే సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి భువి డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

Bhuvneshwar Kumar: వావ్.. చివరి ఓవర్లో భువనేశ్వర్ అద్భుతం.. ఎలాంటి బౌలింగ్ వేశాడో చూడండి..

టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడనే సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి భువి డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (GTvsSRH) భువి మరోసారి తన మార్క్ ప్రదర్శించాడు. అత్యద్భుతంగా చివరి ఓవర్ వేశాడు. భువి వేసిన 20 ఓవర్లో కేవలం రెండు పరుగులు రాగా, నాలుగు వికెట్లు పడ్డాయి (Bhuvneshwar Kumar Final Over).

చివరి ఓవర్ వేసిన భువి ముందుగా గిల్‌ను (Shubman Gill) అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికే రషీద్ ఖాన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్‌ను భువి రనౌట్ చేశాడు. ఆ తర్వాత బంతికి ఒక్క పరుగు లభించింది. ఆ తర్వాత బంతికి మహ్మద్ షమీని అవుట్ చేశాడు. చివరి బంతికి బై రూపంలో ఒక్క పరుగు లభించింది. సులభంగా 200 పరుగులు చేస్తుందనిపించిన గుజరాత్‌ను భువి 188 పరుగులకే కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో భువి మొత్తం ఐదు వికెట్లు తీశాడు.

Viral Video: పాపం.. బంతి ఎంత బలంగా తగిలిందో.. మైదానంలోనే విలవిలలాడిన నూర్ అహ్మద్.. వీడియో వైరల్!

హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు సాధించింది. గిల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), భువనేశ్వర్‌ (27) మాత్రమే రాణించారు. గిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Updated Date - 2023-05-16T10:54:42+05:30 IST