Viral Video: పాపం.. బంతి ఎంత బలంగా తగిలిందో.. మైదానంలోనే విలవిలలాడిన నూర్ అహ్మద్.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-05-16T10:23:42+05:30 IST

క్రికెట్ బంతి ఎంత గట్టిగా ఉంటుందో తెలిసిందే.. అది తగిలితే ఎంత నొప్పి కలుగుతుందో మాటల్లో చెప్పలేం. కొన్నేళ్ల క్రితం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ తగలడంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

Viral Video: పాపం.. బంతి ఎంత బలంగా తగిలిందో.. మైదానంలోనే విలవిలలాడిన నూర్ అహ్మద్.. వీడియో వైరల్!

క్రికెట్ బంతి (Cricket Ball) ఎంత గట్టిగా ఉంటుందో తెలిసిందే.. అది తగిలితే ఎంత నొప్పి కలుగుతుందో మాటల్లో చెప్పలేం. కొన్నేళ్ల క్రితం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ తగలడంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అంత కఠినమైన క్రికెట్ బాల్ బలంగా తగిలడంతో గుజరాత్ బౌలర్ నూర్ అహ్మద్ (Noor Ahmad) నొప్పితో విలవిలలాడాడు. సోమవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ (GTvsSRH) జరిగిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసిన్ (Heinrich Klaasen) ఆడుతుండగా 16వ ఓవర్ వేసేందుకు నూర్ అహ్మద్ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ అవతల వేశాడు. క్లాసిన్ ఆ బంతిని చాలా బలంగా స్ట్రైట్‌గా కొట్టాడు. బంతి వేగంగా వచ్చి నూర్ అహ్మద్ కాలికి తగిలింది. బాల్ వేగంగా రావడంతో తప్పించుకునే వీలు కూడా అహ్మద్‌కు దొరకలేదు. కుడికాలి మడమకు బంతి బలంగా తగలడంతో నూర్ నొప్పితో బాధపడ్డాడు. మైదానంలోనే పడిపోయాడు (Ball Hits Noor Ahmad). వెంటనే సిబ్బంది వచ్చి అతడిని తీసుకెళ్లిపోయారు.

Shubman Gill: నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని చెప్పా.. సెంచరీ అనంతరం శుభమన్ వ్యాఖ్యల

మిగిలిన ఒక బంతిని ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా వేసి ఓవర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత నూర్ డగౌట్‌లో కూర్చుని ఐస్ పెట్టుకున్నాడు. గుజరాత్ టీమ్‌లో కీలక స్పిన్నర్ అయిన నూర్ త్వరలోనే కోలుకుంటాడని మేనేజ్‌మెంట్ ఆశతో ఉంది. ప్లే ఆఫ్స్ సమయానికి నూర్ ఫిట్ అవుతాడని భావిస్తోంది. త్వరలోనే అతడి గాయం గురించి అప్‌డేట్ రానుంది.

Updated Date - 2023-05-16T10:23:42+05:30 IST