ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ishant Sharma: ఢిల్లీని గెలిపించిన ఇషాంత్ శర్మ.. అనుభవం ముందు ఓడిన రాహుల్ తెవాటియా!

ABN, First Publish Date - 2023-05-03T10:36:05+05:30

ఇషాంత్ శర్మ (Ishant Sharma).. ఐదారేళ్ల క్రితం టీమిండియాకు ప్రధాన బౌలర్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించిన పేసర్. అయితే ఇషాంత్ తరచుగా గాయాల బారిన పడుతుండడంతో పాటు యువ బౌలర్ల రాక అతడి అవకాశాలను దెబ్బ కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇషాంత్ శర్మ (Ishant Sharma).. ఐదారేళ్ల క్రితం టీమిండియాకు ప్రధాన బౌలర్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించిన పేసర్. అయితే ఇషాంత్ తరచుగా గాయాల బారిన పడుతుండడంతో పాటు యువ బౌలర్ల రాక అతడి అవకాశాలను దెబ్బ కొట్టింది. 2021లో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆ తర్వాత పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవల జరిగిన మినీ వేలంలో ఢిల్లీ టీమ్ (DC) ఇషాంత్‌ను రూ.50 లక్షల నామమాత్రపు ధరకు దక్కించుకుంది. అతడే ఆ జట్టుకు ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు.

గుజరాత్ టైటాన్స్‌తో (GTvsDC) మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీని ఇషాంత్ గెలిపించాడు. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో ఢిల్లీ కెప్టెన్ ఇషాంత్‌కు బంతిని అందించాడు. అప్పటికే క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా (Rahul Tewatia) మూడు సిక్స్‌లు కొట్టి జోరు మీదున్నాడు. చివరి ఓవర్లో 12 పరుగులు చేయడం అతడికి కష్టం కాదని అందరూ అనుకున్నారు. అయితే ఇషాంత్ శర్మ తన అనుభవం మొత్తాన్ని ఉపయోగించాడు.

GTvsDC: ఆ నిర్ణయమే గుజరాత్ కొంప ముంచింది.. పాండ్యా డీఆర్‌ఎస్ అడిగి ఉంటే..

ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకర రాహుల్‌ను ఔట్ చేశాడు. దీంతో గుజరాత్ టీమ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఢిల్లీ శిబిరం సంతోషంలో మునగిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ టీమ్ మూడింటిలో విజయం సాధించింది.

Updated Date - 2023-05-03T10:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising