GTvsDC: ఆ నిర్ణయమే గుజరాత్ కొంప ముంచింది.. పాండ్యా డీఆర్‌ఎస్ అడిగి ఉంటే..

ABN , First Publish Date - 2023-05-03T10:14:50+05:30 IST

ఒక్కోసారి మనం అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలే బెడిసి కొడతాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం ఆ జట్టు కొంపముంచింది. డీఆర్ఎస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో అతడి జట్టు భారీ మూల్యం చెల్లించింది.

GTvsDC: ఆ నిర్ణయమే గుజరాత్ కొంప ముంచింది.. పాండ్యా డీఆర్‌ఎస్ అడిగి ఉంటే..

ఒక్కోసారి మనం అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలే బెడిసి కొడతాయి. గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అతి విశ్వాసం ఆ జట్టు కొంపముంచింది. డీఆర్ఎస్ (DRS) విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో అతడి జట్టు భారీ మూల్యం చెల్లించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (DCvsGT) ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ దశలో బ్యాటర్ అమన్‌ హకీమ్‌ ఖాన్‌ (Aman Hakim Khan) ఆదుకున్నాడు. అర్ధ శతకంతో చెలరేగాడు. నిజానికి గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan) వేసిన 12వ ఓవర్లో అమన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ అవుట్ ఇవ్వలేదు. డీఆర్‌ఎస్ తీసుకుంటే మంచిదని రషీద్ అడిగాడు. అయితే పాండ్యా అందుకు అంగీకరించలేదు. బంతి ముందు బ్యాట్‌కు తగిలిందని అనుకుని డీఆర్‌ఎస్‌కు వెళ్లలేదు. దీంతో అమన్ బతికి పోయాడు. నిజానికి ఆ బంతి వికెట్ల లైన్‌లో పడి ముందుగా ప్యాడ్‌కే తగిలినట్టు స్పష్టమైంది.

Virat Kohli: దూకుడు, కోపమే కాదు.. విరాట్ కోహ్లీలో ఈ కోణం కూడా ఉంది..

ఒకవేళ పాండ్యా డీఆర్‌ఎస్ కోరి ఉంటే అమన్ అవుట్ అయ్యేవాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న అమన్ అక్షర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు.. రిపల్‌తో కలిసి ఏడో వికెట్‌కు 53 పరుగులు జత చేసి డీసీకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Updated Date - 2023-05-03T10:14:50+05:30 IST