150 మార్క్ దాటిన భారత్
ABN, First Publish Date - 2023-06-26T00:39:48+05:30
స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో అదరగొడుతున్న రోలర్ స్కేటర్లు ఇంకో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు అందించారు. దీంతో మరో రోజు
స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్
బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో అదరగొడుతున్న రోలర్ స్కేటర్లు ఇంకో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు అందించారు. దీంతో మరో రోజు పోటీలు మిగిలుండగా.. భారత్ 66 స్వర్ణాలు, 50 రజతాలు, 41 కాంస్యాలు సహా మొత్తం 157 పతకాలు సాధించింది. స్కేటింగ్‌లో ఆర్యన్ (300 మీ.), దీపన్ (1000 మీ.) పసిడి పతకాలు గెలిచారు. భారత పురుషుల 5-5 బాస్కెట్‌బాల్ జట్టు పోర్చుగల్‌ను ఓడించి స్వర్ణం నెగ్గగా, మహిళల జట్టు రజతంతో సరిపెట్టుకొంది. వాలీబాల్ కాంస్య పోరులో భారత్ 2-0తో కొరియాను ఓడించింది. టెన్ని్‌సలో పురుషుల సింగిల్స్ లెవెల్-5 ఫైనల్లో స్వరాజ్ పరాజయం పాలవగా.. మహిళల హ్యాండ్‌బాల్ ఫైనల్లో భారత్ ఓడింది.
Updated Date - 2023-06-26T00:39:48+05:30 IST