ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023 Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ ఎంత? ఒక్కో జట్టు ఎంత దక్కించుకుంటుంది? ఆ ఆటగాళ్లకు ఎంత వస్తుంది?

ABN, First Publish Date - 2023-05-28T11:55:11+05:30

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు మజాను అందించిన ఐపీఎల్-16 టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్లు తలపడబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు మజాను అందించిన ఐపీఎల్-16 (IPL 2023) టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్లు తలపడబోతున్నాయి. చెన్నై గెలిస్తే ఐదో సారి, గుజరాత్ గెలిస్తే వరుసగా రెండో సారి విజేతలుగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో ట్రోఫీ గెలిచిన జట్టుకు అందే ప్రైజ్‌మనీ ఎంత (IPL 2023 Prize Money)? ప్లే ఆఫ్స్ ఆడిన టీమ్‌లు ఎంత అందుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Harbhajan Singh: ఐపీఎల్ కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తారా? నెటిజన్ విమర్శకు హర్భజన్ దిమ్మదిరిగే రిప్లై!

ఎవరెవరికి ఎంతెంతంటే?

* ఐపీఎల్-16లో విజేతగా నిలిచిన జట్టుకు దక్కే ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు. ఇక, ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు అందుతాయి.

* ఎలిమినేటర్‌లో విజేత అయిన ముంబైకి రూ.7 కోట్లు అందుతాయి. ఎలిమినేటర్‌లో ఓడిపోయిన లఖ్‌నవూ టీమ్‌కు రూ.6.5 కోట్లు దక్కుతాయి.

* ఇక, ఈ సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ (Orange Cap) అందుకున్న బ్యాట్స్‌మెన్‌కు రూ.15 లక్షలు అందిస్తారు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 851 పరుగులు చేసిన గిల్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

* ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ (Purple Cup) అందుకున్న బౌలర్‌కు రూ.15 లక్షల రివార్డు ఇస్తారు. గుజరాత్‌కు చెందిన షమీ (28) ఈ జాబితాలో నెంబర్ వన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత గుజరాత్‌కే చెందిన రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ (24) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

* సూపర్ స్ట్రైకర్ అవార్డు గెలుచుకున్న ఆటగాడికి రూ.15 లక్షలు బహుమతిగా ఇస్తారు.

* ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్న ఆటగాడికి రూ.20 లక్షల రివార్డు ఇస్తారు.

Updated Date - 2023-05-28T11:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising