Harbhajan Singh: ఐపీఎల్ కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తారా? నెటిజన్ విమర్శకు హర్భజన్ దిమ్మదిరిగే రిప్లై!

ABN , First Publish Date - 2023-05-28T11:44:44+05:30 IST

అత్యంత ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి.

Harbhajan Singh: ఐపీఎల్ కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తారా? నెటిజన్ విమర్శకు హర్భజన్ దిమ్మదిరిగే రిప్లై!

అత్యంత ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ (IPL 2023) కీలక పోరుకు సిద్ధమైంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్లు తలపడబోతున్నాయి. దాదాపు రెండు నెలలుగా తాజా, మాజీ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం రకరకాలుగా విధులు నిర్వహించారు. సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కామెంటేటర్ అవతారం ఎత్తాడు.

చాలా మ్యాచ్‌లకు తనదైన శైలిలో వ్యాఖ్యానం (IPL Commentary) చేశాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ హర్భజన్‌పై విమర్శలు గుప్పించాడు. రాజ్యసభ సభ్యుడైన (Member of Rajya Sabha) హర్భజన్ ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ, తన విధులను పక్కన పెట్టి ఐపీఎల్ కోసం కామెంటరీ చెబుతున్నాడని ఓ వ్యక్తి విమర్శించాడు. ఆ వ్యక్తికి హర్భజన్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ``నేను ప్రజల డబ్బును ఎక్కడ దుర్వినియోగం చేశాను? దయచేసి చెప్పండి బ్రదర్. ఎమ్‌పీకి (MP) వచ్చే నిధులన్నీ నియోజకవర్గంలోని ప్రజలకే వెళతాయి. ప్రజలకు సేవ చేసే విషయంలో నేను రాజీపడను.

MS Dhoni: గాళ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసే ముందు ధోనీ సలహా అడిగిన దీపక్ చాహర్.. చెన్నై కెప్టెన్ ఏం చెప్పాడంటే..

ఎమ్‌పీ నిధులతో పంజాబ్‌లోని వివిధ గ్రామాలకు నేనేం వసతులు కల్పించానో అక్కడి వారికి తెలుసు. నాకు ఎవరి గుర్తింపూ అక్కర్లేదు. నాకు పదవి ఇవ్వాలని నేను ఎవరినీ అడగలేదు. భారత్‌కు ఆడడం ద్వారా నా గుర్తింపును నేనే సంపాదించుకున్నాన``ని హర్భజన్ రిప్లై ఇచ్చాడు. హర్భజన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-05-28T11:44:44+05:30 IST