హాకీ అమ్మాయిలకు వరుసగా మూడో ఓటమి
ABN, First Publish Date - 2023-07-21T03:46:18+05:30
జర్మనీ టూర్‌లో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. బుధవారం రాత్రి జరిగిన ఆఖరి, మూడో మ్యాచ్‌లో భారత్ 0-2తో
రుస్సేల్షియమ్: జర్మనీ టూర్‌లో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. బుధవారం రాత్రి జరిగిన ఆఖరి, మూడో మ్యాచ్‌లో భారత్ 0-2తో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. జర్మనీ తరఫున నైక్ లోరెంజ్ (52వ నిమిషం), చార్లెటీ స్టాపెన్‌హో్‌స్ట (54వ) చెరో గోల్ చేశారు. తొలి మూడు క్వార్టర్లలో జర్మనీని గోల్ చేయనివ్వకుండా భారత్ సమర్థంగా ఎదుర్కొంది. కానీ, నాలుగో క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను లోరెంజ్ గోల్‌గా మలచి జర్మనీకి 1-0 పైచేయి అందించింది. మరో రెండు నిమిషాల తర్వాత చార్లెటీ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని డబుల్ చేసింది. టూర్ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో 2-3తో ఓడిన భారత్.. రెండో మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 1-4తో చిత్తయింది. ఐరోపా టూర్‌లో భాగంగా స్పెయిన్‌లో జరిగే టోర్నీ కోసం భారత మహిళల జట్టు వెళ్లనుంది.
Updated Date - 2023-07-21T03:46:37+05:30 IST