హసరంగ అరుదైన రికార్డు
ABN, First Publish Date - 2023-06-26T01:08:00+05:30
వనిందు హసరంగ వరుసగా మూడోసారి 5 వికెట్లు పతనంచేసిన రెండో బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. పాక్ పేసర్ వకార్
వరుసగా మూడోసారి ఐదు వికెట్లు
సూపర్ సిక్స్‌లో శ్రీలంక
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్
వనిందు అదరహో..
వనిందు హసరంగ వరుసగా మూడోసారి 5 వికెట్లు పతనంచేసిన రెండో బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. పాక్ పేసర్ వకార్ యూనిస్ 1990లో ఈ ఘనతను అందుకున్నాడు. హసరంగ వరుసగా 6, 5, 5 వికెట్లు పడగొట్టాడు.
బులవాయో: లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ (5/79) వన్డేల్లో వరుసగా మూడోసారి ఐదు వికెట్లు తీసి వన్డేల్లో అరుదైన రికార్డును అందుకున్నాడు. మరోవైపు ఓపెనర్ కరుణరత్నే (103) వన్డేలలో తొలి సెంచరీ కొట్టాడు. దాంతో వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 133 పరుగులతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక సూపర్ సిక్స్‌కు చేరింది. తొలుత లంకేయులు 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటయ్యారు. భారీ ఛేదనలో ఐర్లాండ్ 31 ఓవర్లలో 192 రన్స్‌కే ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ (320), 76 రన్స్‌తో ఒమన్ (244/9)పై నెగ్గింది. స్కాట్లాండ్, ఒమన్ కూడా ఈ గ్రూపునుంచి సూపర్ సిక్స్‌కు చేరగా.. ఐర్లాండ్ రేసు నుంచి నిష్క్రమించింది.
Updated Date - 2023-06-26T01:08:00+05:30 IST