ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joginder Sharma : ఆ ఫైనల్‌’ హీరో... ఆటకు గుడ్‌బై

ABN, First Publish Date - 2023-02-04T04:28:17+05:30

ప్రారంభ టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన మీడియం పేస్‌ బౌలర్‌ జోగీందర్‌ శర్మ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు 39 ఏళ్ల జోగీందర్‌ శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగీందర్‌

న్యూఢిల్లీ: ప్రారంభ టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన మీడియం పేస్‌ బౌలర్‌ జోగీందర్‌ శర్మ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు 39 ఏళ్ల జోగీందర్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన జోగీందర్‌.. 2004లో బంగ్లాదేశ్‌తో వన్డేతో అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో నాలుగు వన్డేలు, నాలుగు టీ20లు ఆడిన అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ జోగీందర్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం గమనార్హం. అదే ఏడాది హరియాణా పోలీస్‌ శాఖలో చేరిన జోగీందర్‌.. ప్రస్తుతం డిప్యూటీ సూపరిండెంట్‌గా పని చేస్తున్నాడు.

ఆ ఒక్క ఓవర్‌తో హీరోగా...: కెరీర్‌లో ఆడింది అతి తక్కువ మ్యాచ్‌లే అయినా జోగీందర్‌కు ఆ ఒక్క ప్రదర్శన ఎనలేని స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఎంతలా అంటే.. తొలి టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌ అనగానే జోగీందర్‌ పేరు స్ఫురించేలా. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ ఫైనల్‌ ప్రత్యర్థి పాకిస్థాన్‌. ఆఖరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 13 పరుగులు కావాలి. క్రీజులో మిస్బావుల్‌ హక్‌ ఉన్నాడు. ఈ దశలో బంతి నందుకున్న జోగీందర్‌ తొలి బంతిని వైడ్‌గా వేసిన జోగీందర్‌, రెండో బంతికి సిక్సర్‌ ఇచ్చాడు. దీంతో పాక్‌ గెలుపు సమీకరణం 4 బంతుల్లో 6 రన్స్‌గా మారింది. అభిమానుల్లో ఉత్కంఠ.. జోగీందర్‌లో ఒత్తిడి మొదలైంది. అయి తే, జోగీందర్‌ వేసిన బంతిని స్కూప్‌ చేయబోయిన మిస్బా ఫైన్‌లెగ్‌ దిశగా షాట్‌ కొట్టాడు. అక్కడే కాచుకున్న శ్రీశాంత్‌ బంతిని పట్టుకోవడంతో పాక్‌ కథ సమాప్తమైంది.. ట్రోఫీ భారత్‌ సొంతమైంది. ఇలా.. ఆ ఒక్క ఓవర్‌తో జోగీందర్‌ టీమిండియా హీరోగా నీరాజనాలు అందుకున్నాడు.

Updated Date - 2023-02-04T04:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising