Alastair Cook : క్రికెట్‌కు కుక్ గుడ్‌బై
ABN, First Publish Date - 2023-10-14T00:51:50+05:30
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు శుక్రవారం వీడ్కోలు పలికాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 38 ఏళ్ల కుక్..
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు శుక్రవారం వీడ్కోలు పలికాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 38 ఏళ్ల కుక్..కౌంటీల్లో ఎసెక్స్‌కు ఆడుతున్నాడు. ‘క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం అంత సులువుకాదు. రెండు దశాబ్దాలకుపైగా క్రికెట్ నా జీవితంలో భాగమైంది’ అని పేర్కొన్నాడు. 12,472 టెస్ట్ రన్స్‌తో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రికార్డును కుక్ నెలకొల్పాడు.
Updated Date - 2023-10-14T00:51:50+05:30 IST