ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fourth Test AUS vs IND : ఏం చేస్తారో?

ABN, First Publish Date - 2023-03-11T00:30:01+05:30

పరుగుల వరద పారించింది. ఉస్మాన్‌ ఖవాజా మారథాన్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. కామెరూన్‌ గ్రీన్‌ సైతం తొలి శతకం పూర్తి చేశాడు. ఇక చివరి సెషన్‌లో చకచకా ఆసీ్‌సను చుట్టేద్దామనుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బ్యాటర్లపైనే భారమంతా

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 480 ఆలౌట్‌

గ్రీన్‌ శతకం

అశ్విన్‌కు ఆరు వికెట్లు

భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ 36/0

రెండో రోజూ అదే తీరు.. ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా

పరుగుల వరద పారించింది. ఉస్మాన్‌ ఖవాజా మారథాన్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. కామెరూన్‌ గ్రీన్‌ సైతం తొలి శతకం పూర్తి చేశాడు. ఇక చివరి సెషన్‌లో చకచకా ఆసీ్‌సను చుట్టేద్దామనుకుంటే.. టెయిలెండర్లు లియోన్‌, మర్ఫీ అడ్డుగోడలా నిలిచారు. తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 70 పరుగులు జోడించి మరీ క్రీజును వదల్లేదు. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ భారీ స్కోరుకు దోహదపడ్డారు. అటు జీవం లేని పిచ్‌పైనా అశ్విన్‌ ఆరు వికెట్లు తీయడం విశేషం. ఇప్పుడిక భారమంతా భారత బ్యాటర్లదే. ఫ్లాట్‌ వికెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ చెలరేగుతారా? లేక ఆసీస్‌ బౌలర్లకు లొంగుతారా? మూడో రోజు తేలనుంది.

అహ్మదాబాద్‌: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్‌ ఖవాజా (180) రెండో రోజు కూడా తన పట్టు వదల్లేదు. ఏకంగా 10 గంటల 11 నిమిషాలపాటు క్రీజులో నిలిచిన తను బౌలర్లకు చుక్కలు చూపించాడు. తనకు జతగా కామెరూన్‌ గ్రీన్‌ (114) కూడా సెంచరీ చేయడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167.2 ఓవర్లలో 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో మర్ఫీ (41), లియోన్‌ (34) జోడీ సైతం విసిగించింది. అశ్విన్‌కు ఆరు, షమికి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ రోజు ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 36 పరుగులు చేసింది. గిల్‌ (18 బ్యాటింగ్‌), రోహిత్‌ (17 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత్‌ ఇంకా 444 పరుగులు వెనుకంజలో ఉంది.

ద్విశతక భాగస్వామ్యం: 255/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ రెండో రోజు ఆటను ఆరంభించగా.. మొదటి సెషన్‌లో ఖవాజా, గ్రీన్‌ జోడీ సాధికారిక ఆటతో చెలరేగింది. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు సాధిస్తూ వికెట్‌ కోల్పోకుండా ఆడారు. సెషన్‌ ఆరంభ ఓవర్‌లోనే గ్రీన్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి పది ఓవర్లపాటు ఈ జోడీ డిఫెన్సివ్‌ ఆటతో ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. ఆ తర్వాత అడపాదడపా బౌండరీలతో స్కోరు 300 దాటింది. ఇక 114వ ఓవర్‌లో గ్రీన్‌ మూడు ఫోర్లతో చెలరేగగా.. అటు ఖవాజా కూడా ఫోర్‌తో 150 రన్స్‌ పూర్తి చేశాడు. మొత్తంగా వీరి ఆటతో ఈ సెషన్‌లో 92 పరుగులు వచ్చాయి. ఇక లంచ్‌ బ్రేక్‌ తర్వాత గ్రీన్‌ కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే భారత్‌లో ఈ ఫీట్‌ సాధించిన ఆరో ఆసీస్‌ బ్యాటర్‌గా నిలిచాడు. 128వ ఓవర్‌లో ఖవాజా ఎల్బీ కోసం జడేజా ఒత్తిడి మేరకు రోహిత్‌ రివ్యూ కోరాడు. కానీ బంతి ఆఫ్‌ స్టంప్‌నకు చాలా దూరంలో వెళ్లినట్టు తేల డంతో ఆటగాళ్లంతా నవ్వుకోవడం కనిపించింది. ఎట్టకేలకు భారత్‌ ఎదురుచూపులకు తెర దించుతూ అశ్విన్‌ ఒకే ఓవర్‌లో గ్రీన్‌, క్యారీ(0)ని అవుట్‌ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 208 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే స్టార్క్‌ (6)ను కూడా అశ్వినే అవుట్‌ చేశాడు. 409 పరుగులతో ఆసీస్‌ టీ బ్రేక్‌కు వెళ్లింది.

తోక పోరాటం: రెండో సెషన్‌లో అశ్విన్‌ మూడు వికెట్లు తీసి భారత్‌కు ఊరటనివ్వగా.. చివరి సెషన్‌లో తొలి బంతికే కీలక ఖవాజా వికెట్‌ను ఆసీస్‌ కోల్పోయింది. అక్షర్‌ ఓవర్‌లో అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ ద్వారా ఈ వికెట్‌ లభించింది. ఈ సిరీ్‌సలో అతడికిదే తొలి వికెట్‌ కావడం గమనార్హం. కానీ భారత్‌కు ఈ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. మరో రెండు వికెట్లను టపటపా తీద్దామనుకున్న బౌలర్లకు లియోన్‌, మర్ఫీ చెమటలు పట్టించారు. స్పెషలిస్ట్‌ బ్యాటర్లను తలపిస్తూ చక్కటి ఫోర్లతో జట్టు భారీ స్కోరు సాధించేలా చేశారు. షమి ఓవర్‌లో లియోన్‌ మూడు ఫోర్లు బాది 15 పరుగులు రాబట్టాడు. 19.2 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన వీరు తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జత చేశారు. చివరకు వరుస ఓవర్లలో అశ్విన్‌ ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌-ఆసీ్‌స జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ వికెట్లు (113) తీసిన

బౌలర్‌గా లియోన్‌తో సమంగా నిలిచిన అశ్విన్‌. అలాగే భారత్‌లో ఎక్కువ సార్లు (26) 5+ వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే (25)ను అశ్విన్‌ అధిగమించాడు.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 32; ఖవాజా (ఎల్బీ) అక్షర్‌ 180; లబుషేన్‌ (బి) షమి 3; స్మిత్‌ (బి) జడేజా 38; హ్యాండ్స్‌కోంబ్‌ (బి) షమి 17; గ్రీన్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 114; క్యారీ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 0; స్టార్క్‌ (సి) శ్రేయాస్‌ (బి) అశ్విన్‌ 6; లియోన్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 34; మర్ఫీ (ఎల్బీ) అశ్విన్‌ 41; కునేమన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 167.2 ఓవర్లలో 480 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-61, 2-72, 3-151, 4-170, 5-378, 6-378, 7-387, 8-409, 9-479, 10-480. బౌలింగ్‌: షమి 31-3-134-2; ఉమేశ్‌ 25-2-105-0; అశ్విన్‌ 47.2-15-91-6; జడేజా 35-5-89-1; అక్షర్‌ 28-8-47-1; శ్రేయాస్‌ 1-0-2-0.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 17; గిల్‌ (బ్యాటింగ్‌) 18; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 10 ఓవర్లలో 36/0.బౌలింగ్‌: స్టార్క్‌ 3-1-7-0; గ్రీన్‌ 2-0-11-0; లియోన్‌ 3-0-14-0; కునేమన్‌ 2-0-3-0.

Updated Date - 2023-03-11T07:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising