Sheetal : రెండు చేతులు లేకున్నా.. ప్రపంచ పారా ఆర్చరీలో ఫైనల్‌కు
ABN, First Publish Date - 2023-07-22T00:45:18+05:30
ప్రతిభకు వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తోంది భారత పారా ఆర్చర్ షీతల్ దేవి. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ 16 ఏళ్ల టీనేజర్.. రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలను సంధిస్తూ అదరహో అనిపిస్తోంది. తాజాగా
భారత టీనేజర్ షీతల్ సంచలనం
న్యూఢిల్లీ: ప్రతిభకు వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తోంది భారత పారా ఆర్చర్ షీతల్ దేవి. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ 16 ఏళ్ల టీనేజర్.. రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలను సంధిస్తూ అదరహో అనిపిస్తోంది. తాజాగా చెక్ రిపబ్లిక్‌లోని పిల్సెన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో షీతల్.. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరిలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ్‌సలో షీతల్ 137-133తో భారత్‌కే చెందిన సరితను ఓడించింది. దీంతో టోర్నీలో పతకం ఖాయం చేసుకున్న షీతల్.. ప్రపంచక్‌పలో ఫైనల్ చేరిన చేతులు లేని మహిళా ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగే స్వర్ణ పతక పోరులో టర్కీకి చెందిన ఓజ్నర్ కురెతో షీతల్ తలపడనుంది. మరో భారత ఆర్చర్ సరిత కాంస్య పతకం కోసం బ్రెజిల్ ఆర్చర్ జేన్ కార్లాగోగెల్‌తో పోటీపడనుంది.
Updated Date - 2023-07-22T00:45:24+05:30 IST