ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సూపర్‌ ఫైట్‌తో ఆరంభం

ABN, First Publish Date - 2023-10-05T01:47:34+05:30

తాజా వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లోనే 2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లండ్‌-కివీస్‌ పోటీపడనున్నాయి. ఇరు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లకు కొదువ లేదు. అలాగే రెండు జట్లు కూడా తమ ప్రాక్టీ్‌సను అద్భుతంగా సాగించాయి..

మధ్యాహ్నం 2 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌, హాట్‌స్టార్‌లో

తాజా వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లోనే 2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లండ్‌-కివీస్‌ పోటీపడనున్నాయి. ఇరు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లకు కొదువ లేదు. అలాగే రెండు జట్లు కూడా తమ ప్రాక్టీ్‌సను అద్భుతంగా సాగించాయి. ఇంగ్లండ్‌ ఒక వామప్‌ మ్యాచ్‌ను ఆడి గెలువగా.. కివీస్‌ రెండింట్లోనూ అదరగొట్టింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఈ మ్యాచ్‌కు టామ్‌ లాథమ్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వీరి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మిచెల్‌, లాథమ్‌, చాప్‌మన్‌, కాన్వే, నీషమ్‌ పూర్తి ఫామ్‌లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్‌ జట్టు తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనుకుంటోంది. అందుకే స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను తిరిగి వన్డే జట్టులో చేర్చారు. వామప్‌ పోరుకు దూరమైన స్టోక్స్‌ తొలి మ్యాచ్‌లో ఆడేది కూడా అనుమానమే. క్లిష్ట పరిస్థితిలో తన అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చడం అతడికి అలవాటు. అలాగే బెయిర్‌స్టో, మలాన్‌, కెప్టెన్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, రూట్‌లతో బ్యాటింగ్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది.

Updated Date - 2023-10-05T01:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising