ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలనాటి క్రికెట్‌ తార దురానీ కన్నుమూత

ABN, First Publish Date - 2023-04-03T00:19:18+05:30

పాతతరం క్రికెటర్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన భారత మాజీ ఆల్‌రౌండర్‌, స్టయిల్‌ ఐకాన్‌ సలీమ్‌ దురానీ (88) ఆదివారం మరణించాడు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న దురానీకి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: పాతతరం క్రికెటర్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన భారత మాజీ ఆల్‌రౌండర్‌, స్టయిల్‌ ఐకాన్‌ సలీమ్‌ దురానీ (88) ఆదివారం మరణించాడు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న దురానీకి, గతేడాది తొడ ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. గుజరా త్‌లోని జామ్‌నగర్‌లో సోదరుడు జహంగీర్‌ ఇంట్లో ఉంటున్న సలీమ్‌ జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడు. 1934లో అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్‌లో జన్మించిన సలీమ్‌ ఎడమ చేతి వాటం బ్యాటర్‌, స్పిన్నర్‌. భారత్‌ తరఫున 29 టెస్టుల్లో సెంచరీ సహా 1202 పరుగులు చేయడంతో పాటు 75 వికెట్లు కూల్చాడు. 1971లో వెస్టిండీ్‌సపై టీమిండియా తొలిసారి టెస్ట్‌ మ్యాచ్‌ నెగ్గడంలో దురానీ కీలకపాత్ర వహించాడు. అదే మ్యాచ్‌లో గవాస్కర్‌ అరంగేట్రం చేశాడు. దూకుడుగా ఆడే దురానీ.. పబ్లిక్‌ డిమాండ్‌పై సిక్స్‌లు కొట్టేవాడు. అందుకే అతడి ఆటను చూడడానికి అభిమానులు స్టేడియాలకు క్యూ కట్టేవారు. 1961-62లో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో ఇంగ్లండ్‌పై 2-0తో టీమిండియా చరిత్ర సృష్టించడంలో అతడిదే ప్రధాన భూమిక.

1960లో బ్రబౌర్న్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్ట్‌లో అరంగేట్రం చేసిన దురానీ.. 1973లో ఇదే వేదికలో ఇంగ్లండ్‌తో తన చివరి మ్యాచ్‌ ఆడాడు. సొగసుగా అతడు ఆడే సొగసైన షాట్లకు స్టేడియం హోరెత్తేది. ఓసారి ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో సలీమ్‌ను తప్పించడంతో మైదానంలో ‘నో దురానీ.. నో టెస్ట్‌’ అని ప్రేక్షకులు బ్యానర్లు ప్రదర్శించడం.. అతడి పాపులారిటీకి నిదర్శనం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించినా.. ఫీల్డింగ్‌లో చురుకుదనం లేకపోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్రలకు ప్రాతినిథ్యం వహించాడు. అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్‌ దురానీనే. 2011లో సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. ఇక 1973లో పర్వీన్‌ బాబీ హీరోయిన్‌గా ‘చరిత్ర’ సినిమాలో సలీమ్‌ హీరోగా నటించాడు.

Updated Date - 2023-04-03T00:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising