ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Sri Lanka: శ్రీలంక పని పడుతున్న సిరాజ్.. ఓటమి దిశగా శ్రీలంక

ABN, First Publish Date - 2023-01-15T19:04:51+05:30

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక విలవిల్లాడుతోంది. టీమిండియా నిర్దేశించిన 391 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లంకకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక విలవిల్లాడుతోంది. టీమిండియా నిర్దేశించిన 391 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగుల వద్ద ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత మరింతగా చెలరేగిన సిరాజ్.. నువనిదు ఫెర్నాండో (19)ను బౌల్డ్ చేశాడు. అదే ఊపుతో కుశాల్ మెండిస్ (4), వనిందు హసరంగ (1)లను పెవిలియన్ పంపాడు. చరిత్ అసలంక (1)ను షమీ అవుట్ చేశాడు. అలాగే, చమిక కరుణ రత్నె(1).. సిరాజ్ బౌలింగులోనే రనౌట్ అయ్యాడు. దీంతో 39 పరుగులకే ఆరు కీలక వికెట్లను కోల్పోయిన శ్రీలంక ఓటమి దిశగా సాగుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక విజయం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిశాయి. లంక 6 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. కెప్టెన్ దాసున్ షనక, వెల్లాలేజ్ క్రీజులో ఉన్నారు.

అంతకుముందు శుభమన్ గిల్ (116), కోహ్లీ (166, నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.

Updated Date - 2023-01-15T19:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising